2022 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమ.. పలువురు దిగ్గజ నటులను కోల్పోయింది. కృష్ణంరాజు, కృష్ణల మరణాన్ని మరువక ముందే.. రెండు రోజుల వ్యవధిలోనే మరో ఇద్దరు సీనియర్ నటులు చనిపోవడం విషాద ఛాయలు అలముకున్నాయి. డిసెంబర్ 23న కైకాల సత్యనారాయణ చనిపోతే నేడు (డిసెంబర్ 25) ప్రముఖ నటుడు చలపతి రావు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చలపతిరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా చలపతిరావును చివరి చూపులు చూశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఎన్టీఆర్..చలపతి రావు కుమారుడు నటుడు, దర్శకుడు రవిబాబుకు వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. అనంతరం చలపతిరావు పార్థీవ దేహాన్ని చివరి చూపులు చూసుకున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన.
— Jr NTR (@tarak9999) December 25, 2022
తన ట్విట్టర్ ఖాతాలోనూ సంతాపం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ట్వీట్ పెట్టారు. ‘‘చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’’ అని ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్, చలపతిరావు కాంబినేషన్ పలు సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఆది సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ చలపతిరావు నటన చిత్రానికి హైలెట్గా నిలిచింది. నందమూరి కుటుంబానికి , చలపతిరావుకు మంచి అనుబంధం ఉంది.
.@tarak9999 Video Call to Ravi Babu due to Sudden demise of #ChalapathiRao garu 🙂
May his soul Rest In Peace 🙏 pic.twitter.com/PuOmNfWOFi
— Dhanush 🧛 (@Always_kaNTRi) December 25, 2022
ఇవి కూడా చదవండి :
రాత్రి చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా కన్నుమూశారు.. రవిబాబు
‘చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు’- నందమూరి బాలకృష్ణ
సినిమా సెలబ్రిటీల బండారం బయటపెడతా : నటి వార్నింగ్
2022 బాలీవుడ్ టాప్ 10 చిత్రాలు..!