ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న నిన్న గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి ఆ వెంటనే భార్య కోరిక మేరకు అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం బెంగుళూరులో నారాయణ హృదయాలయం ఆసుపత్రికి తరలించారు. అక్కడ తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. గుండెపోటు రాగానే నలభై నిముషాలు సీపీఆర్ చేయటంతో మెదడు దిబ్బతినే అవకాశం ఉందని, ఆర్గాన్ బ్లీడింగ్ కూడా ఉందని అంటున్నారు. దీంతో తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో తారకరత్నని పరామర్శించేందుకు ఎన్టీఆర్ బెంగుళూరుకి తరలివెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం
జూనియర్ ఎన్టీఆర్ బెంగుళూర్ కి వెళతారని, చంద్రబాబు నాయుడు కూడా తారకరత్నని పరామర్శించేందుకు బెంగుళూరుకి వెళ్లన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ తారకరత్నతో పాటుగా బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. నారాయణ హృదయాల డాక్టర్స్ ఉదయ్, రఘు బృందం ఆధ్వర్యంలోనే తారకరత్నకు అత్యాధునిక చికిత్సను అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. బీపీ అధికంగా ఉండడం ద్వారానే బ్లీడింగ్ కూడా జరుగుతుందని.. బ్లీడింగ్ ని కంట్రోల్ చేసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
ఐసీయూలోనే తారకరత్న..ఎక్మో అమర్చి ట్రీట్మెంట్ ?
బెంగళూరులో ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స…ప్రస్తుతం ఎలా ఉందంటే…