Jr NTR Help Jr NTR Help sampoornesh babu In Bigg Boss Season-1
mictv telugu

కష్టంలో ఉన్న సంపూర్ణేష్‎ను ఆదుకున్న జూ.ఎన్టీఆర్

January 3, 2023

రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మొత్తం ఆరు సీజన్లు ముగిశాయి. ఏడవ సీజన్ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు కూడా ‎చేసేస్తున్నారు. ఈసారి కొంచెం కొత్తగా వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హోస్ట్ కూడా‎ మారే అవకాశాలున్నాయి అంటున్నారు.మూడు సీజన్లు చేసిన నాగార్జను మరో సీజన్ చేసేందుకు నిరాకరిస్తుండడంతో బాలయ్య బాబును రంగంలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అహాలో అన్ స్టాపబుల్ టాక్‎షో తో అదరగొడుతున్న బాలకృష్ణ..బిగ్ బాస్ చేస్తే పాత వైభవం వస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కనపెడితే ఆరు సీజన్లుగా బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ రన్ అవ్వడానికి మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారణమని చెప్పాలి. బిగ్‎బాస్ మెుదటి సీజన్‎కు ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. యాంకరింగ్‎తో బిగ్ బాస్ షోలో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి బిగ్ బాస్ షో తెలుగు ప్రజల్లోకి దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. అప్పటి బిగ్ బాస్ కంటెస్ట్ సంపూర్ణేష్ బాబుకి ఎన్టీఆర్ చేసిన సాయాన్ని తాజాగా మొదటి సీజన్ మరో కంటెస్టెంట్ సమీర్ వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీర్ మాట్లాడుతూ “మా సీజన్‌లో సంపూర్ణేష్ బాబు స్వతహాగా ఎలిమినేషన్‎కు సిద్ధపడ్డాడు. పల్లెటూరి నుంచి వచ్చిన సంపూర్ణేష్‎కు ఓ రూమ్‌లో బంధించి ఉంచడం పెద్దగా నచ్చలేదు. అక్కడ ఉండేందుకు అతను చాలా ఇబ్బంది పడ్డాడు. కొన్ని సార్లు చిన్నపిల్లాడిలా ఏడ్చిన సందర్భాలున్నాయి. తిండికూడా సరిగ్గా తినేవాడు కాదు. ఇక చివరికి తన వల్ల కాకపోవడంతో వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. స్వతహాగా ఎలిమినేషన్‌కు పూనుకున్నాడు. అయితే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం స్వతహాగా ఎలిమినేషన్‎కు వెళితే రూ.25 లక్షలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అయితే అతడు డబ్బు కట్టి బయటకు వెళిపోవడానికే సిద్ధమయ్యాడు. ఈ విషయం జూ.ఎన్టీఆర్‌కి తెలియడంతో ..మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి రూ.25 లక్షలు కట్టకుండానే సంపూని ఎలిమినేషన్ చేశారు” అని సమీర్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : 

బ్లూ ఫిలిమ్స్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

మైండ్ బ్లోయింగ్ మాస్.. రవితేజకి తోలి 100కోట్లు ?

అమెరికాలో బాలయ్య-మెగా ఫ్యాన్స్ ఫైటింగ్

బీజేపీని దెబ్బ కొట్టింది నినే.. కేసీఆర్ కాదు ED,CBI ఎవనికి భయపడేది లేదు.. ఎమ్మెల్యే కొనుగోలు పై పైలట్ రోహిత్ రెడ్డి