Jr. NTR legend..but, no chance: Janhvi Kapoor
mictv telugu

జూ.ఎన్టీఆర్‌‌పై జాన్వీకపూర్‌ ప్రశంసలు..ఆయనొక

August 4, 2022

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ ప్రశంసల వర్షం కురిపించింది. తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే తనకు బాగా ఇష్టమని, ఎన్టీఆర్‌తో నటించడానికి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నానని తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టింది.

”ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు చేస్తున్నా. మరికొన్ని లైన్‌లో ఉన్నాయి. నాకు తెలుగు సినిమాల్లో కూడా నటించాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. ఈ మధ్య జూ.ఎన్టీఆర్ సినిమాలో ఆయన పక్కన నేను హీరోయిన్‌గా నటించబోతున్నానని ఓ వార్తను చదివాను. అది నిజం కాదు. ఒకవేళ ఆ వార్త నిజమైతే చాలా బాగుండు. ఎందుకంటే జూ.ఎన్టీఆర్ ఓ లెజెండ్. కానీ, ఆయన పక్కన నటించే ఛాన్స్ నాకింకా రాలేదు. ఎప్పటికైనా ఆయనతో ఓ సినిమా చేస్తా.

గతకొన్ని రోజులుగా ఎన్టీఆర్‌- కొరటాల శివ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటించబోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై జాన్వీ కపూర్ స్పందించింది. అది నిజమైతే ఎంత బాగుండో అంటూ మురిసిపోయింది. కానీ, ఆ ఛాన్స్ తనకు ఇంకా రాలేదని ఆవేదన చెందింది.