మియా మాల్కోవా తర్వాత చూసిన బెస్ట్ బాడీ జూ.ఎన్టీఆర్‌దే.. వర్మ
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతాడో తెలియదు. మహాత్మాగాంధీని చంపిన నాథురాం గాడ్సే మీద సినిమా తీస్తానని ట్వీట్ చేసిన వర్మ మరికొద్ది సేపటిలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆయన జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సిక్స్ ప్యాక్ ఫోటో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ ఫోటోపై వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ఈ మేరకు ఆ ఫోటోను షేర్ చేస్తూ పైన కామెంట్ చేశాడు. అందులో సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఎన్టీఆర్‌ను ఏకంగా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో పోల్చేశాడు వర్మ. తాజాగా వర్మ, మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇంకా అదే మత్తులో ఉన్నాడు. అందుకే మియా మాల్కోవా తర్వాత తాను చూసిన బెస్ట్ బాడీ జూనియర్ ఎన్టీఆర్‌దే అంటూ ట్వీట్ చేశాడు. దీంతో వర్మ అభిమానులు నవ్వుల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. వర్మా నీ ఎటకారానికో దండం అంటున్నారు. ఇది ప్రశంస అనుకోవాలో.. సెటైర్ అనుకోవాలో అర్థం కావడం లేదు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.