బిగ్ బాస్ షో మెల్ల మెల్లగా జనం బాగా ఆదరిస్తున్నారు. అయితే ఇందులో తారక్ వరుసల్లో తేడాలొస్తున్నాయి. మొన్న కల్పన జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి… అన్నా … అన్నా… అంటే,అమ్మా నన్ను అన్నా అని పిల్వకు అని చెప్పారు. జ్యోతి తర్వాత మధుప్రియ ఎలిమినేట్ అయ్యారు. ఈమెను ఉద్దేశించి రామారావు… ప్రతీ సారి మధుప్రియ గారు మధుప్రియ గారు అని సంబోధించారు… అన్నా.. నన్ను గారు అని పిల్వొద్దని రిక్వెస్ట్ చేశారు. దీంతో రామారావు… చెల్లెమ్మా అన్నారు. చివరకు రామారావు, మధుప్రియకు రామారావు ఓ టాస్క్ ఇచ్చారు… ఏదో నిర్ణయం చెప్పడంలో ఆలస్యం చేసింది. దానికి రామారావు..ఏదో చెప్పు పిల్ల ఇంత సేపా అన్నరు… అంతా ఒక్కటే నవ్వులు. ఆ షోలో పాల్గొంటున్న వారు కూడా అన్న… అక్క.. ఏదో వరుసతో పిలుచుకుంటున్నారు. అయితే ఆ తర్వాత చాలా ట్విస్టులతో షో నడిచింది. ఎలిమినేట్ తర్వాత శిక్షలు వేయించడం…. ఫోటోలు పెట్టి మార్కులు వేయించారు. అయితే మధుప్రియ మాటల గురించి కూడా తారక్ చిలక ముచ్చట చెప్పి ఓ చురక వేశారు.
బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న వారు హౌజ్ లో బాగా నటిస్తున్నారట. అంతా ఇప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారట. ఈ కమ్యూనికేషన్ ప్రపంచంలో నలుగురి మధ్య… ఫోన్లు… టీవీలు లేకుండా బతికే సందర్భంలో ఎదురయ్యే చాలా విషయాలు ఈ షోలో చూపిస్తున్నారు.
మధుప్రియ ఎలిమినేట్ అయ్యాక… మరో తారను హౌజ్ లోకి పంపించారు రామారావు. బిగ్ బాస్ నిర్ణయం మేరకు ఇట్లా చేశామన్నారు. అయితే అందాలు చిన్న తెరపై ఆరబోసేందుకు.. ప్రేక్షకులను మరింత కట్టివేసేందుకు స్విమ్మింగ్ పూల్ సీన్ తో తారను తెరపై చూపించారు.