Jr NTR : why junior ntr absent for awards function organisation reveals the news
mictv telugu

Jr NTR : HCA అవార్డు షోకు జూనియర్ ఎన్టీఆర్ అందుకే రాలేదట

March 1, 2023

Jr NTR : why junior ntr absent for awards function organisation reveals the news

ప్రపంచమంతా తెలుగు సినిమా పరిశ్రమ వైపు చూసేలా చేసింది ఆర్ఆర్ఆర్ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి తన ప్రాణాన్ని పెట్టి అత్యాధునిక హంగులతో ఈ సినిమాను తెరకెక్కించాడు. స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు అంతే అద్భుతంగా నటించి తమ పాత్రలకు జీవం పోశారు. టెక్నీషన్ ల దగ్గరి నుంచి ప్రొడక్షన్ వరకు అందరూ అమేజింగ్ అవుట్ పుట్ ను అందించేందుకు కృషి చేశారు. అందుకే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఆర్ఆర్ఆర్ కు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఆస్కార్ తో సహా ఇంటర్నేషనల్ అవార్డులను సైతం కొల్లగొట్టింది ఈ మూవీ. ఈ మధ్యనే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో నాలుగు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది . దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి సహా హీరో రామ్ చరణ్ లు ఈ ట్రోఫీలను అందుకోవడానికి అమెరికా వెళ్లారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అదేమిటంటే ఆర్ఆర్ఆర్ టీం అంతా హాజరైన ఈ వేడుకలో సందడి చేస్తూ, జూ.ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అవార్డు షోలో యంగ్ టైగర్ లేకపోవడంతో ఏదో లోటుగా ఫీల్ అయిన అభిమానులు అప్సెట్ అయ్యారు. ఇక సోషల్ మీడియా ఊరికే ఉంటుందా ఈ వార్తను తెగ వైరల్ చేసేసింది. ఈ వేడుకకు అసలు ఎన్టీఆర్ ను పిలవనేలేదని కొంత మంది విమర్శలు గుప్పిస్తుంటే మరికొంత మంది ఎన్టీఆర్ అప్సెట్ అయ్యాడని వార్తలు అల్లారు. ఈ రూమర్లకు చెక్ చెప్పేందుకు ఏకంగా హెచ్ సీ ఏ ట్విట్టర్ వేదికగా స్పందించింది.

 

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఎన్టీఆర్ అభిమానులకు స్పష్టతను ఇచ్చింది. “ప్రియమైన RRR అభిమానులకు, #HCAFilmAwardsకి హాజరుకావాలని మేము ఎన్టీఆర్ ను ఆహ్వానించాము, కానీ ఆయన ఇండయాలో తన కొత్త మూవీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఉన్నారు అందుకే రాలేకపోయారు. త్వరలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున ఎన్టీఆర్ కు అవార్డును అందజేస్తామని ప్రకటించారు. మీ సపోర్ట్ కి మీ లవ్ కి మా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

హెచ్ సీ ఏ పోస్ట్ ను సరిదిద్దిన ఎన్టీఆర్ అభిమాని :

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ చేసిన ఈ ట్వీట్ కు ఎన్టీఆర్ అభిమానులు స్పందించారు. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చేయడం లేదని, వాస్తవానికి, తన సోదరుడు నందమూరి తారక రత్న దురదృష్టవశాత్తూ మరణం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడని హెచ్ సీ ఏ పోస్ట్ ను సరదిద్దాడు. దీనికి HCA స్పందిస్తూ, ఎన్టీఆర్ ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నాడని, అందుకే అతను హాజరు కాలేకపోతున్నాడని ఎన్టీఆర్ పీఆర్ తెలిపాడని స్పష్టం చేసింది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ఫిబ్రవరి 20న అమెరికాకు వెళ్లాలని అనుకున్నారు, అయితే ఫిబ్రవరి 18న తన సోదరుడు నటుడు నందమూరి తారక రత్న మరణించారు. దీంతో ఎన్టీఆర్ ఈ పర్యటనను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

మార్చి 12న నాటు నాటుకు అవార్డు :

హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌తో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు నాటు నాటు ట్రాక్ కోసం ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకోబోతోంది. మార్చి 12, ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరుగబోతోంది. మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏమిటంటే ఈ ట్రాక్ ను లైవ్ గా పెర్ఫార్మ్ చేస్తారని వినిపిస్తోంది. అదే కనుగ జరిగితే ఆర్ఆర్ఆర్ అభిమానులకు ఇక పండుగే.