Jubilant Bhartia Group is setting up a new center in Genome Valley
mictv telugu

జినోమ్ వ్యాలీలో కొత్త కేంద్రం.. 46 వేల మందికి ఉద్యోగాలు

February 25, 2023

Jubilant Bhartia Group is setting up a new center in Genome Valley

ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణకు అంతర్జాతీయ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దాదాపు ప్రతీరోజు ఏదో ఒక కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ సాధించిన పురోగతిని అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా జూబిలాంట్ భార్టియా గ్రూప్ తన కొత్త కేంద్రాన్ని జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. హెచ్‌ఐసీసీలో రెండు రోజులుగా జరుగుతున్న బయో ఆసియా సదస్సులో సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ డెరెక్టర్ శక్తి నాగప్పన్‌లు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జూబిలాంట్ గ్రూప్‌కి తన పూర్తి సహకారం అందిస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ కేంద్రంతో 46 వేల మందికి ఉద్యోగాలు వస్తుండడం సంతోషకరమన్నారు. ఇదే క్రమంలో మరో అంతర్జాతీయ హెల్త్ కేర్ సంస్థ సనోఫీ నగరంలో గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు ఫ్లాండర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడ్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది. అనంతరం మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.