కరోనాకు మందు పట్టుకొచ్చిన మరో కంపెనీ.. ధర ఎంతంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాకు మందు పట్టుకొచ్చిన మరో కంపెనీ.. ధర ఎంతంటే.. 

August 4, 2020

Jubilant Life Sciences launches generic version of remdesivir.

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో వైద్య శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థ కరోనా చికిత్సలో వినియోగించే రెమ్‌డెసివిర్ కి జూబి-ఆర్‌ను పేరుతో జెనరిక్ మందుని విడుదల చేసింది. ఈ మెడిసిన్ 100 మిల్లీగ్రాముల వయల్ ధరను రూ.4,700గా నిర్ణయించారు. 

ఈ మెడిసిన్ ను దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ పేషెంట్లకు వినియోగించనున్నారు. ఈ ఏడాది మే నెలలో గిలియాడ్ సైన్సెస్‌కు చెందిన రెమ్‌డెసివిర్ మందును తయారు చేసేందుకు గాను ఆ కంపెనీతో జూబిలంట్ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే జూబిలంట్ జూలై 20న డీసీజీఐ నుంచి జూబి-ఆర్ తయారీకి గాను అనుమతులు పొందింది. ఈ మందును దీన్ని కోవిడ్ అత్యవసర స్థితి ఉన్న పేషెంట్లకు వాడుతారు.