జూబ్లీహిల్స్‌లో దారుణం.. వ్యాపారి కిడ్నాప్, హత్య - MicTv.in - Telugu News
mictv telugu

జూబ్లీహిల్స్‌లో దారుణం.. వ్యాపారి కిడ్నాప్, హత్య

February 4, 2020

Jubilee Hills.

హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన చేపల వ్యాపారిని దారుణంగా హత్యచేశారు. ఎస్ఆర్ నగర్‌లో ఈ నెల 1న చేపల వ్యాపారి రమేష్‌ను ఆగంతకులు కిడ్నాప్ చేశారు. రూ. 90 లక్షలు ఇస్తేనే వదిలేశామని అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించారు ఇవాళ ఉదయానికి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు.  రమేశ్ చేపల వ్యాపారంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుండడంతో అతని వద్ద చాలా డబ్బు ఉంటుందని అపహరించారు.  

రమేష్ అదృశ్యంపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని కళ్యాణ్ నగర్‌లో పోలీసులకు రమేష్ మృతదేహం లభించింది. గోనెసంచిలో రమేష్ మృతదేహాన్ని పెట్టి కిడ్నాపర్లు పడవేశారు. కాగా, ఎస్ఆర్ నగర్ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎస్సై అశోక్ నాయక్ తమను బూతులు తిట్టారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ కూడా అస్సలు పట్టించుకోలేదని తెలుస్తోంది.