టాటూలా మిగిలిపోవాలనే గట్టిగా కొరికాం.. జూబ్లీహిల్స్ కేసు రేపిస్టులు - MicTv.in - Telugu News
mictv telugu

టాటూలా మిగిలిపోవాలనే గట్టిగా కొరికాం.. జూబ్లీహిల్స్ కేసు రేపిస్టులు

June 13, 2022

కలకలం రేపుతున్న వీఐపీల కొడుకుల గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదని, నిందితులు పక్కా పథకంతోనే అమ్నీసియా పబ్‌కు వెళ్లి దురాగతానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. రుమేనియా బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితుల విచారణలో పోలీసులకు సహకరించడం లేదని సమాచారం. గట్టిగా ప్రశ్నిస్తే ముఖాలు పక్కకు తిప్పుకుంటున్నారట. నేరం ఒప్పుకున్న నిందితులతో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అమ్మాయి శరీరంపై రేప్‌కు గుర్తుగా శాశ్వతంగా పచ్చబొట్లలా మిగిలిపోవాలని గట్టిగా కొరికినట్లు వారు చెప్పారు. బాలికపై 12 చోట్ల రక్కిన, పంటితో కొరికిన గాట్లు ఉన్నాయని మెడికల్ రిపోర్టులో తేలింది.

మరోపక్క.. నిందితులకు ఓ స్టార్‌హోటల్ నుంచి బిర్యానీ సరఫరా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పెద్దపెద్ద ప్యాకెట్లలతో బిర్యానీలు తీసుకెళ్తున్న దృశ్యాలు మీడియాలో వస్తున్నాయి. అయితే అవి తమ సిబ్బంది తెప్పించుకున్న ప్యాకెట్లని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో నిందితుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. అంతా నువ్వే లీక్ చేశావని సాదుద్దీన్‌ను నిందితులు కొట్టినట్లు సమాచారం. నిందితుల్లో ఒకడైన సాదుద్దీన్ రెచ్చగొట్టడం వల్లే రేప్ చేశానని ఓ నిందితుడు అన్నాడట. నిందితుల్లో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, బహదుర్ పురా ఎమ్మెల్యే కొడుకు, ఓ ఎమ్మెల్యే అక్క కొడుకు, ఓ కార్పొరేటర్ కొడుకు ఉండడంతో కేసులను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.