జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు, ఏ1 సాదుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇవాళ ఐదుగురు మైనర్లను అమ్నేషియా పబ్, కాన్సూ బేకరి ప్రాంతాలకు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ 36, 44లలోనూ పరిశీలించారు. పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నేరం ఎలా జరిగిందనేది నమోదు చేసుకున్నారు.
మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సాదుద్దీన్‌ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చనున్నారు. ఈ నెల 10న సాదుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. బాలిక అత్యాచారానికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు.
సీన్రీకన్స్ట్రక్షన్ తర్వాత ఐదుగురు మైనర్లను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించిన పోలీసులు.. సాయంత్రం 5 గంటల వరకు వారిని ప్రశ్నించనున్నారు. సాదుద్దీన్ చెప్పిన వివరాల ఆధారంగా మైనర్లను ప్రశ్నిస్తున్నారు.