తెలంగాణలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అత్యాచార ఘటనలో మైనర్ బాలికను తీసుకెళ్లిన బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లే నడిపినట్టు గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. బెంజ్ కారు యజమానిపై కేసు నమోదు చేశారు.
ఆ కారు ఎమ్మెల్యే కూతురదని సమాచారం. బాలిక అత్యాచారానికి గురైన ఇన్నోవా కారు.. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్ కారుగా పోలీసులు తేల్చారు. డ్రైవర్‌తో పాటు ఇన్నోవాలో పబ్‌కు వెళ్లిన మసి ఉల్లాఖాన్ కుమారుడు.. ఆ తర్వాత పబ్ నుంచి తన స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లాడు. అక్కడ డ్రైవర్ ను వెనక్కి పంపి కారును మైనర్లు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మసి ఉల్లాఖాన్ సొంత కారుకి ప్రభుత్వ వాహనమని స్టిక్కర్ వేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది.