Jubilee Hills Gangrape case: Accused harassing another girl also
mictv telugu

గ్యాంగ్‌రేప్ కేసులో సంచలన నిజాలు.. మరో అమ్మాయిని కూడా..

June 6, 2022

Jubilee Hills Gangrape case: Accused harassing another girl also

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఈ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు.. బాధితురాలితో పాటు మరోకరిని కూడా వేధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారానికి కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా నిర్ధారించారు పోలీసులు. వేధింపులు భరించలేకే పబ్‌ నుండి బాలికలు బయటకు రాగా, బాలికల వెనకాలే సాదుద్దీన్ అండ్ గ్యాంగ్ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరిలో ఒకరు.. బయటకు వచ్చి నేరుగా క్యాబ్ బుక్‌ చేసుకుని వెళ్లిపోయారు. మిగిలిన మైనర్‌పైనే దుండగులు దాష్టికానికి పాల్పడ్డారు. పబ్ ఎదుటే నిలబడ్డ బాలికను ట్రాప్ చేసిన కార్పొరేటర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్ ఖాన్‌కు చెందిన బెంజ్ కారులో తీసుకెళ్లాడు. ఆ కారులో బాలికతోపాటు నలుగురు ప్రయాణం చేశారు.

కాగా ఈ కేసులో బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు పోలీసులు. స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు. A-6గా ఎమ్మెల్యే కొడుకు పేరు నమోదయ్యే అవకాశం ఉంది. పోక్సో చట్ట ప్రకారం బాధితురాలి స్టేట్‌మెంట్‌ ను పోలీసులు ఫైనల్‌ చేయనున్నారు. నిన్న ఆమ్నేషియా పబ్‌ సిబ్బందిని పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారించారు. మే 28న ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. పబ్‌ సిబ్బంది స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.