ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచే 'జూబ్లీ హిల్స్' మెట్రో.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచే ‘జూబ్లీ హిల్స్’ మెట్రో..

May 18, 2019

మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ ప్రారంభం కానుండటంతో నాగోల్-హైటెక్ సిటీ మార్గంలోని అన్ని స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. మొదట అమీర్‌పేట్ – హైటెక్ సిటీ మార్గంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీన ప్రారంభమైంది. అయితే అప్పుడు కేవలం ఐదు స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. మెట్రో అధికారులు వెనువెంటనే పనులు పూర్తి చేస్తూ.. మాదాపూర్, పెద్దమ్మగుడి స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇన్నాళ్లు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడ్డారు. చెక్ పోస్ట్ నుంచి పెద్దమ్మగుడి వరకు ఆటో లేదా బస్సులో వెళ్లి అక్కడి నుంచి మెట్రోలో ప్రయాణించే వారు. ఇక చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ నుంచే ప్రారంభమవడంతో ప్రయాణికులంతా.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.