జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన..రాజకీయ నేత ఫాం హౌస్‌‌లో ఆశ్రయం - MicTv.in - Telugu News
mictv telugu

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన..రాజకీయ నేత ఫాం హౌస్‌‌లో ఆశ్రయం

June 5, 2022

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై కొంతమంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఈ ఘటనకు సంబంధించి నేడు పోలీసుల దర్యాప్తులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి కర్ణాటకలోని గుల్బార్గాలో నిందితుడైన ఓ మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. అతడిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మరో విషయం వెలుగుచూసింది.

బాలికపై అత్యాచారం తర్వాత నిందితులు ఇన్నోవా కారులో మొయినాబాద్‌కు వెళ్లారని, అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్‌లో వారు ఆశ్రయం పొందారని సమాచారం. అక్కడి నుంచే నిందితులు వేర్వేరు చోట్లకు పరారీ అయినట్లు తెలుస్తోంది. నిందితులు తమ సిమ్ కార్డులను ఇద్దరి వ్యక్తుల ఫోన్లలో వేసి, వాళ్లను గోవాకు పంపించి, నిందితులు కర్ణాటకకు వెళ్లారు. ఘటనకు ముందు ఉపయోగించిన ఇన్నోవా కారును
ఫాం హౌస్ వెనుక దాచారు. వాహనానికి ఉన్న గవర్నమెంట్ స్టిక్కర్‌ను తొలగించి, నిందితులు ఫాం హౌస్‌‌లో ఆశ్రయం పొందినట్లు సమాచారం అందడంతో పోలీసులు..ఆ ఫాం హౌస్ యజమానిని అదుపులోకి తీసుకొని, వివరాలను సేకరిస్తున్నారు.