jubileehills gang rape case accused found under judge presence with victim girl today in hyderabad
mictv telugu

జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు

June 27, 2022

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను గుర్తించే ప్రక్రియను పోలీసులు ఇవాళ పూర్తి చేశారు. జడ్జి సమక్షంలో అత్యాచారం చేసిన వారిని గుర్తించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను గుర్తించిన బాలిక పోలీసులకు పూర్తి వివరాలు తెలుపగా.. న్యాయమూర్తి ఆ వివరాలను నమోదు చేసుకున్నారు. న్యాయమూర్తి సమక్షంలో చంచల్‌గూడ జైలులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ ను, ఆ తర్వాత సైదాబాద్‌లోని జువైనల్ హోంకు తీసుకొచ్చి ఐదుగురు మైనర్ బాలురను కూడా బాలిక గుర్తించింది. మే 28వ తేదీన జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సాదుద్దీన్‌(18) ప్రధాన నిందితుడు (ఏ-1) కాగా.. మిగిలిన అయిదుగురు మైనర్లు. ప్రస్తుతం సాదుద్దీన్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. మిగిలిన ఐదుగురు మైనర్లు సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉన్నారు.

ఇక రేప్ జరిగినట్లు పోలీసులు చెబుతున్న ఇన్నోవా కారులో క్లూస్ టీం ఇప్పటికే పలు ఆధారాలు సేకరించింది. డీఎన్ఏ రిపోర్ట్ తో ఇన్నోవా వాహనంలో దొరికిన ఆధారాలను పోల్చనున్నారు. నిందితులు ఇన్నోవాలోనే ఉన్నారని పక్కాగా నిరూపించడానికి పోలీసులకు డీఎన్ఏ రిపోర్ట్ ఎంతో కీలకం కానుంది. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించేందుకు కోర్టు అనుమతి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.