ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలైన ఓ వివాహిత(29) వ్యభిచారం చేస్తూ ముంబై పోలీసులకు పట్టుబడింది. ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరచగా కోర్టు షెల్టర్ హోంకు తరలించాలని ఆదేశించింది. అయితే తాను వివాహితతని, ఎయిడ్స్ బాధితురాలినని, బయటకెళ్తే తన కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తారని ఆమె గోడు వెళ్లబోసుకుంది. తనను షెల్టర్ హోం నుంచి విడుదల చేయాలని న్యాయమూర్తిని వేడుకుంది.అయితే దీనికి ఆమె కుటుంబ సభ్యులు అడ్డుచెప్పారు. ‘ఆమెకు వ్యభిచారమే జీవనాధారం. అది తప్ప ఆమె ఇంకేమీ చేయలేదు. బయటకు వస్తే మళ్లీ అదే వృత్తిని కొనసాగిస్తుంది. అందుకే అమెను షెల్టర్ హోంలోనే ఉంచండి. లేకపోతే ఆమెకు ఉన్న ఎయిడ్స్ ఇంకా చాలామందికి వస్తుంది’. అని సదరు మహిళ కుటుంబ సభ్యులు కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ఆమె బయటకు వెళ్లి, మళ్లీ వ్యభిచారం మరింత మంది ఎయిడ్స్ బారిన పడే అవకాశం ఉందని, షెల్టర్ హోంలోనే ఉంచాలని అదనపు సెషన్స్ జడ్జి ఆర్. ఎం. సంద్రాణి ఆదేశించారు.