ఆ జడ్జిని విమానంలో తీసుకెళ్లండి! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ జడ్జిని విమానంలో తీసుకెళ్లండి!

August 27, 2017

గుర్మీత్ బాబా అనుచరులు భారీ విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో రేప్ కేసులో తీర్పు ఇచ్చిన  సీబీఐ కోర్టు జడ్జి జగదీప్ సింగ్ భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాబాకు జస్టిస్ సింగ్ ఈ నెల 28న.. సోమవారం శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జడ్జి భద్రత కోసం హైకోర్టు పలు చర్యలు తీసుకుంది.

బాబా ప్రస్తుతం ఉంటున్న రోహ్ తక్ జైల్లోనే తీర్పును వెలువరించాలని జడ్జిని ఆదేశించింది. జస్టిస్ సింగ్ ను విమానంలోగాని, హెలికాప్టర్ లోగాని సురక్షితంగా జైలుకు తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించింది.

‘‘తీర్పు ప్రకటించడానికి జైలే సరైంది. అక్కడ అన్ని ఏర్పాటూ చేయండి. న్యాయవాదులకు, జడ్జికి ఇబ్బంది కలగకుండా చూడండి. జడ్జిని, ఆయన సిబ్బందిని సురక్షితంగా జైలుకు తీసుకెళ్లండి.. ’’ అని ఆదేశించింది.