ట్రంప్‌కు ‘అసభ్య’ వేలు చూపిన మహిళ గెలిచింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌కు ‘అసభ్య’ వేలు చూపిన మహిళ గెలిచింది..

November 9, 2019

జూలీ బ్రిస్క్‌మెన్ కొన్ని రోజుల క్రితం ఈమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా అసభ్యకరంగా వేలు చూపించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 2017లో వర్జీనియాలో ఇది జరిగింది. ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా సైకిల్‌పై వెళ్తున్న జూలీ తన మధ్య వేలు చూపించిది. ఈ ఫొటోో వైరల్ కావడంతో అనూహ్యంగా ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఓ దశలో ట్రంప్‌పై అసభ్యంగా ప్రవర్తించడమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తం అయింది. 

Cyclist

ఆ తర్వాత ఆమె పాపులర్‌గా మారడంతో తాజాగా అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. అమెరికన్ రిప్లబిక్ పార్టీ అభ్యర్థిపై డెెమాక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె భారీ మెజార్టీని సాధించుకున్నారు. ట్రంప్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన జూలీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అభ్యర్థిపై విజయం సాధించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. తన విజయాన్ని ట్విటర్ ద్వారా ఆమె పంచుకుంది. అప్పటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఫోటోను కూడా జతచేసింది. దీంతో ట్రంప్‌పై ఆమె విజయం సాధించినట్టుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

నిజానికి ఆమె తన ఎన్నికల ప్రచారంలో ఏనాడూ ఆ విషయాన్ని గుర్తు చేయలేదు. తన ఉద్యోగం పోయిన తర్వాత ఆమె స్థానికంగా ఉండే సమస్యలపై పోరాటం సాగిస్తూ వచ్చింది. అందరికీ సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ ధైర్యంతోనే ఇటీవలే తాను ఉంటున్న లూబర్న్ కౌంటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంది. ఎన్నికైతే తాను ఏం చేస్తాననే విషయాలు  చెప్పడంతో అక్కడి ప్రజలు ఆమెకు ఘన విజయాన్ని కట్టబెట్టారు.