బ్రేకింగ్.. వికీలీక్స్ అసాంజే అరెస్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. వికీలీక్స్ అసాంజే అరెస్ట్..

April 11, 2019

అమెరికాతోపాటు పలు దేశాలకు చెందిన కీలక పత్రాలను బహిర్గతం చేసి, అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారిన జూలియన్ అసాంజ్ చిక్కుల్లో పడ్డారు. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఏడేళ్లగా తలదాచుకుంటున్న ఆయనను బ్రిటన్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. చేతులకు బేడీలు వేసి బయటికి తీసుకొచ్చారు.

 Julian Assange arrested at Ecuadorian embassy WikiLeaks founder arrested for alleged breach of bail at London embassy where he took refuge for seven years

ఇద్దరు స్వీడిష్ మహిళలపై లైంగిక దాడి కేసులో అతడు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. తనను స్వీడన్ కు అప్పగిస్తే, స్వీడన్ అమెరికాకు అప్పగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అమెరికాకు భయపడి  ప్రపంచ దేశాలు అతనికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాయి. చివరకు ఈక్వెడార్ ముందుకొచ్చిన తన ఎంబసీలో ఆశ్రయం ఇచ్చింది. స్వీడన్ నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో వెస్ట్ మినెస్టర్ కోర్టు అతనిపై అరెస్ట్ వారంటు జారీ చేసింది. దీంతో ఈక్వెడార్ ప్రభుత్వం అతనికి ఆశ్రయాన్ని రద్దు చేసింది.