ఏనుగెక్కిన పెళ్లికూతురు.. పక్కనే అంబేద్కర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏనుగెక్కిన పెళ్లికూతురు.. పక్కనే అంబేద్కర్

May 28, 2022

పెళ్లి వేడుకల్లో బారాత్ కూడా ఒకటి. ఇప్పటి వరకూ చాలా వేడుకల్లో వివాహ వేదిక వద్దకు నూతన వధువు ఖరీదైన కార్లలోనో, గుర్రపు బండి మీదనో వచ్చే దృశ్యాలను చూశాం. తాజాగా గుజరాత్ తోని సురేంద్ర నగర్ జిల్లాలో ఓ పెళ్లి కూతురు.. ఏనుగు అంబారీపై వచ్చింది. ఇందులో ఏముంది.. ఎవరి రేంజ్ వాళ్లది అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆ ఏనుగుకి ఇరువైపులా అంబేద్కర్ చిత్రపటాలతో పాటు.. ఆడపిల్లలకు చదువు చెప్పాలని, కులవివక్ష లేకుండా అందరికీ సమానత్వం అనే రెండు ఫ్లేక్సీలను కూడా ఏర్పాటు చేయడం వధ్వాన్ పట్టణంలో చర్చనీయాంశమైంది.

ఆ వధువు పేరు భారతి పర్మార్, ఆమె తండ్రి నాటు పర్మార్. పాతికేళ్ల క్రితం తన పెళ్లి రోజున ఆనాటి అగ్రవర్ణ కుల పెద్దల కారణంగా ఈ విధంగా ఏనుగుపై రావడం కుదర్లేదని, రెండు దశాబ్ధాల తర్వాత తన కూతురు ద్వారా తన కల నెరవేరిందని అంటున్నారు నాటు పర్మార్. దళిత కుటుంబానికి చెందిన కారణంగా గతంలో తనకు ఎదురైన తిరస్కరణ, బహిష్కరణ తన పిల్లల భవిష్యత్తులో ఎదురుకాకుడదని, వారిని పెద్ద చదువులు చెప్పించానన్నారు. నర్సింగ్ చేసిన తన కూతురిని ఇలా ఏనుగ అంబారీపై ఊరేగించి పెళ్లి చేద్దామనుకున్నానని , అదే విధంగా చేశానన్నారు. ఆడపిల్లలకు కూడా చదువు ముఖ్యమేనని, మనుషులంతా ఒకటేనని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా మనం మన ఇష్టానుసారంగా జీవించలేకపోతే, మన హక్కులను ఎప్పుడు సాధించుకుంటాం? అతను అంటున్నారు.