junagadh civil hospital did successful operation mentally ill patient
mictv telugu

బాబోయ్.. అతని పొట్టలో 62 చెక్క ముక్కలు, 15 స్ట్రాలు, 2 హెన్నా కోన్స్

September 1, 2022

గుజరాత్లోని జునాగఢ్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు ఓ వ్యక్తికి అరుదైన ఆపరేషన్ చేశారు. అతని పొట్ట నుంచి 62 చెక్క ముక్కలు, 15 ప్లాస్టిక్ స్ట్రాలు, 2 హెన్నా కోన్లను తొలగించారు. డాక్టర్లు ఆ వ్యక్తి పొట్టలో అన్ని వ్యర్థాలు ఉండడాన్ని చూసి షాకయ్యారు. మతిస్థిమితం లేక, బాధను బయటకు చెప్పుకోలేక కొన్నేళ్లుగా నరకం చూస్తున్న అతడికి కొత్త జీవితాన్ని అందించారు.

డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ వీరావల్లోని మాల్దా ప్రాంతానికి చెందిన.. 40 ఏళ్ల అర్జున్ చంద్పాకు పుట్టుకతోనే మైండ్ సరిగా పనిచేయదు. గత కొన్నిరోజులుగా అతను పొట్ట నొప్పితో బాధ పడుతూ జునాగఢ్ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అతనికి సీటీ స్కాన్ చేసి పొట్టలో 79 వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. అతనికి ప్రాణహాని జరగకముందే వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు గంటలపాటు ఆపరేషన్ చేసి ఆ వ్యక్తి పొట్టలో నుంచి 62 చెక్కముక్కలు, 15 ప్లాస్టిక్ స్ట్రాలు, 2 హెన్నా కోన్లు తొలగించారు. అవన్నీ అతని పొట్టలో గడ్డకట్టి ఉన్నాయి. అతడు దాదాపు మూడేళ్లుగా ఈ కడుపు నొప్పితో బాధపడి ఉంటాడని డాక్టర్ మినేష్ సింఘాల్ అన్నారు. ఈ ఆస్పత్రి చరిత్రలోనే ఇటువంటి కేసును మొదటి సారిగా చూస్తున్నామని చెప్పారు.