Home > Corona Updates > జూన్ 6 వరకు కోర్టుల్లో లాక్‌డౌన్‌ను పొడిగించిన హైకోర్టు

జూన్ 6 వరకు కోర్టుల్లో లాక్‌డౌన్‌ను పొడిగించిన హైకోర్టు

June 6

తెలంగాణ రాష్ట్రంలోని కోర్టుల్లో లా‌క్‌డౌన్‌ను జూన్ 6 వ‌ర‌కు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయించింది. కోర్టులు, ట్రిబ్యున‌ళ్ల లాక్‌డౌన్‌ను జూన్ 6 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అత్య‌వ‌స‌ర కేసుల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ చేప‌ట్టాల‌ని జిల్లా కోర్టుల‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

హైద‌రాబాద్, రంగారెడ్డి మిన‌హా ఇత‌ర జిల్లాల్లో ఆన్‌లైన్‌తో ‌ పాటు నేరుగా పిటిష‌న్లు దాఖ‌లు చేసుకునేందుకు హైకోర్టు అనుమ‌తించింది. మరోవైపు కోర్టుల్లో మాస్కులు, శానిటైజేష‌న్ ప్ర‌క్రియ‌ల‌ను చేప‌ట్టి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హైకోర్టు సూచించింది.

Updated : 29 May 2020 6:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top