అమ్మకు ప్రేమతో తీస్తా.. జూనియర్ ఎన్టీఆర్ ! - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకు ప్రేమతో తీస్తా.. జూనియర్ ఎన్టీఆర్ !

July 17, 2017

‘ బిగ్ బాస్ ’ షో లో జూనియర్ ఎన్టీఆర్ నోటి నుండి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ప్రముఖ యాంకర్ కత్తి కార్తీక ఎంట్రీ ఇవ్వడంతోనే ‘ అన్నా మీ నాన్నకు ప్రేమతో సినిమా చాలా బాగుందని, తన బాబు కూడా ఆ సినిమా చాలా సార్లు చూసాడని ’ చెప్పింది. అప్పుడు ఎన్టీఆర్ అయితే నేను మీ అబ్బాయి కోసమైనా ‘ అమ్మకు ప్రేమతో ’ సినిమా చేస్తానని అన్నాడు. నిజంగా తను అన్నట్టు అమ్మకు ప్రేమతో సినిమా తీస్తే చాలా బాగుంటుందనుకుంటున్నారు అతని ఫ్యాన్స్.