'సీఎం ఎన్టీఆర్' అభిమానుల నినాదాలు..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

‘సీఎం ఎన్టీఆర్’ అభిమానుల నినాదాలు..వీడియో వైరల్

May 21, 2019

ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. మే 20 ఆయన పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌ ఇంటికి అభిమానులు భారీగా చేరుకొని అభిమాన నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ అభిమానులు ‘సీఎం ఎన్టీఆర్’ అని నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత వాతావరణం వేడెక్కింది. త‌న అభిమానులు చేస్తున్న హంగామాను గుర్తించిన ఎన్టీఆర్ వాళ్లకు త‌న ఇంటి టెర్రస్ నుంచి అభివాదం చేశారు.

ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ త‌ర‌ఫున ప్రచారం చేసిన సంగతి తెలిసందే. ఆ త‌ర్వాత ప్రత్యక్ష రాజ‌కీయాల దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ మృతి తరువాత సోద‌రి సుహాసిని కూక‌ట్‌ప‌ల్లి నుంచి పోటీ చేసిన‌ప్పుడు ఎన్టీఆర్, ఆయ‌న సోద‌రుడు క‌ళ్యాణ్ రామ్‌లు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సీఎం నివాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.