నందమూరి తారకరత్న మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజీకీయ రంగాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న చిన్న వయసులోనే చనిపోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రెండు తారకరత్న గురించి రెండు కీలక విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హీరోగా కెరీర్ ప్రారంభించిన తర్వాత తారకరత్న అమరావతి అనే సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించి నంది అవార్డు గెలుచుకున్నారు. ఈ సినిమా తర్వాత అవకాశాలు సన్నగిల్లాయి. అదే సమయంలో కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల వారికి దూరంగా కొంతకాలం జీవించాడు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తారకరత్న కనీసం పిల్లల అవసరాలను కూడా తీర్చే స్థితిలో లేడనే విషయం జూనియర్ ఎన్టీఆర్‌కి తెలిసింది.
దాంతో వెంటనే స్పందించి ప్రతీనెలా రూ. 4 లక్షల డబ్బును ఎవరికీ తెలియకుండా పంపించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని పరోక్షంగా తారకరత్న ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. తమ కుటుంబం ఇలా నిలబడడానికి కారణం తమ్ముడు ఎన్టీఆర్ అని, ఆయనే లేకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. నేను నా కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో లేనప్పుడు నా తమ్ముడు అండగా నిలబడి రక్షించాడని వెల్లడించారు.
తాత అంటే విపరీతమైన అభిమానం
తాత నందమూరి తారక రామారావు అంటే విపరీతమైన అభిమానం చూపించే తారకరత్న తన పిల్లల పేర్లలో తాత పేరు కలిసివచ్చేలా చూసుకున్నారు. తారకరత్న – అలేఖ్య రెడ్డి దంపతులకు మొదట ఒక పాప (నిష్క), తర్వాత కవలలుగా ఒక పాప, బాబు (తనయ్ రామ్, రేయా) అనే పేర్లు పెట్టారు. పిల్లల పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలు (Nishka, Tanayram, Reya) NTR అనే పేరు రావడం గమనార్హం.