డైనోసార్‌తో హేయ్ బ్రో.. గగుర్పొడిచే ట్రైలర్ - MicTv.in - Telugu News
mictv telugu

డైనోసార్‌తో హేయ్ బ్రో.. గగుర్పొడిచే ట్రైలర్

April 19, 2018

జురాసిక్ పార్క్ సినిమాలపై జనంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. అద్భుతమైన గ్రాఫిక్స్, ఒళ్లు గగొర్పొడిచే సన్నివేశాలతో సాగే ఈ మూవీలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది. అందుకే మరో సినిమా సిద్ధమైంది. డైనోసార్ల అభిమానులు ఎదురుచూస్తున్న ‘జురాసిక్‌ వరల్డ్‌-ఫాలెన్‌ కింగ్‌డమ్‌’ చివరి ట్రైలర్‌ ను విడుదల చేశారు.

పోరాట సన్నివేశాలు, పాడైపోయిన డైనోసార్ల ద్వీపం.. ఓ డైనోసార్‌ను పెంచిన హీరో.. అది తనపై దాడి చేయబోతున్నప్పుడు హేయ్ బ్రో అని అనడం వంటి సీన్లు ఉన్నాయి. 2015లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌కు సీక్వెల్‌ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. జేఏ బయోనా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూన్‌ 22న విడుదల కానుంది.