Just Miss: Pak batman who was going to hit the bowler..Video goes viral
mictv telugu

బౌలర్‌ని కొట్టబోయిన పాక్ బ్యాట్‌మెన్..వీడియో వైరల్

September 8, 2022

ఆసియా క‌ప్‌ సూప‌ర్‌-4లో భాగంగా గతరాత్రి పాకిస్థాన్‌-ఆఫ్ఘ‌నిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న టైంలో పాకిస్తాన్‌ బ్యాట్‌మెన్ అసిఫ్ అలీ ఆగ్రహాంతో రగిలిపోయి, ఆఫ్ఘానిస్తాన్ బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టబోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

130 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్..మొదటి నుంచి తడబడుతూ ఆడింది. ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లు వేసిన బంతులకు వరుసగా వికెట్లు కోల్పోవటం మొదలుపెట్టింది. దాదాపు పాకిస్తాన్ ఓట‌మికి చేరువైంది. ఈ క్రమంలో 18వ ఓవ‌ర్‌లో పాక్ బ్యాట‌ర్ అసిఫ్ అలీ..ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ ఫ‌రీద్‌పై బ్యాట్‌తో దాడి చేయ‌బోయాడు. అయిదో బంతికి సిక్స‌ర్ కొట్టిన అలీని, ఆర‌వ బంతికి ఫ‌రీద్ ఔట్ చేశాడు.

దాంతో అలీని ఔట్ చేసిన త‌ర్వాత..ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ ఫ‌రీద్‌ ఆనందంలో అరిచాడు. ఆగ్రహించిన పాకిస్తాన్ బ్యాట్‌మెన్ అసిఫ్ అలీ.. అత‌ని బ్యాట్‌తో కొట్టడానికి మీది మీదికి వెళ్లాడు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. అయితే, వెంట‌నే ఆఫ్ఘ‌న్ ప్లేయ‌ర్లు జోక్యం చేసుకుని ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌ను వేరు చేశారు. చివ‌రి ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు అవ‌స‌రం కాగా, తొలి రెండు బంతుల్లో న‌సీమ్ రెండు సిక్స‌ర్లు బాదాడు. దాంతో ఆఫ్ఘ‌న్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఆఫ్ఘ‌న్ బౌల‌ర్‌పై అసిఫ్ అలీ బ్యాట్ ఎత్తిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.