Home > Business Trends > జస్ట్ ఒక్క ఎస్ ఎంఎస్.. ఆధార్ పాన్ కార్డు లింక్…

జస్ట్ ఒక్క ఎస్ ఎంఎస్.. ఆధార్ పాన్ కార్డు లింక్…

జులై 1 నుంచి పాన్‌ దరఖాస్తులకు ఆధార్‌ మస్ట్. ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోవాలనుకుంటున్నారా…జస్ట్ ఒక్క ఎస్ ఎం ఎస్ చాలు..ఆధార్ పాన్ కార్డు అనుసంధానం అవుతుంది. అది ఎలాగంటే….
ఐటీ రిటర్న్స్‌ కోసం ఆధార్‌-పాన్‌ అనుసంధానాన్ని ఐటీశాఖ తప్పనిసరి చేసింది. ఇందుకోసం ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో ఆధార్‌-పాన్‌ లింక్‌ను ఏర్పాటుచేసింది. ఈ లింక్‌ను ఓపెన్‌ చేసి.. అందులో ఆధార్‌ కార్డు నంబర్‌ను పాన్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు.ఒకవేళ రెండు కార్డుల్లోని పేర్లలో ఏవైనా స్వల్ప తేడాలుంటే.. మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ చేసి ఓటీపీ ద్వారా రెండింటినీ ఐటీ శాఖ ధ్రువీకరిస్తుంది. ప్రస్తుతం మొబైల్‌ ద్వారానే రెండింటినీ అనుసంధానం చేసుకునేలా వీలు కల్పిస్తోంది. ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆధార్‌-పాన్‌ను అనుసంధానం చేసుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది.
ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి ఆదాయపు పన్నుశాఖ మరో సదుపాయం కల్పిస్తోంది. ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆధార్‌ కార్డుకు పాన్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకోవచ్చని ఐటీ శాఖ తెలిపింది. ఈ మేరకు మెసేజ్‌ ద్వారా ఎలా లింక్‌ చేసుకోవాలో చెబుతూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. 567678 లేదా 56161 నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ చేసి.. ఆధార్‌-పాన్‌ను లింక్‌ చేసుకోవాలని సూచించింది.

Updated : 31 May 2017 8:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top