Justice Armugaswamy gave a report on Jayalalitha's death
mictv telugu

చనిపోయే ముందు డాక్టర్లపై జయలలిత ఆగ్రహం.. ఏమన్నదంటే

October 20, 2022

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై నియమించిన జస్టిస్ అర్ముగస్వామి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. మొత్తం 608 పేజీలతో కూడిన ఈ నివేదికను ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. నివేదికలో పలు ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. మరణానికి ముందు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన జయలలిత.. ఆ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.

ఈ ఆడియోని ఓ వ్యక్తి రికార్డు చేశాడు. కమిషన్ దీన్నికూడా తన నివేదికలో ప్రస్తావించింది. ‘నేను బాధపడుతుంటే మీరు పట్టించుకోవడం లేదు. పిలిచినప్పుడు ఎందుకు రావడం లేద’ని డాక్టర్లపై చిరాకు, అసహనం ప్రదర్శించారు. ఆ సమయంలో ఆమె తీవ్రంగా దగ్గుతుండడం స్పష్టంగా వినిపిస్తోంది. 2016 డిసెంబర్ నెలలో చనిపోయిన జయలలిత మృతిపై అర్ముగస్వామి పలు అనుమానాలు లేవనెత్తారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి జయలలిత నిరాకరించారని డాక్టర్లు అప్పట్లో చెప్పడంపై సందేహం వ్యక్తం చేశారు. మరింత లోతైన సమాచారం కోసం చిన్నమ్మ శశికళతో పాటు అప్పటి ఆమె పర్సనల్ డాక్టర్ శివకుమార్, మాజీ సీఎస్ రామ్మెహన్ రావు, మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధా కృష్ణన్, ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించింది.