చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా - MicTv.in - Telugu News
mictv telugu

చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా

August 28, 2017

భారత 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్  దీపక్ మిశ్రా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మిశ్రాతో  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు  హాజరయ్యారు.

చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా 1977లో లాయర్ గా తన న్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1996లో ఒడిశా  హైకోర్టు కు అడిషనల్ జడ్జీ గా నియమితులయ్యారు. 2009లో  పాట్నా హైకోర్టు కు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. 2010లో ఢిల్లీ హైకోర్టు కు చీఫ్ జస్టిస్ గా పని చేశారు.  2011 లో సుప్రీంకోర్టు  జడ్జిగా అపాయింట్ అయ్యారు. చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ పదవీకాలం ముగియడంతో సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ మిశ్రాను ఆ పదవిలో నియమించారు.