Justice DY Chandrachud appointed Chief Justice of India, to be sworn-in on Nov 9
mictv telugu

భారత 50వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్

October 18, 2022

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నియమితులయ్యారు. సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. జస్టిస్ ఎన్ వి రమణ తరువాత సీజేఐగా స్వల్పకాలానికి నియమితులైన ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్.. నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఇక నవంబర్ 9వ తేదీన జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ లలిత్ కేవలం 74 రోజులపాటే ప్రధాన న్యాయమూర్తిగా ఉంటుండగా, జస్టిస్ చంద్రచూడ్ మాత్రం రెండేళ్ల వరకూ సుదీర్ఘకాలం వ్యవహరించనున్నారు సీజేఐ నియామక సంప్రదాయ ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును అక్టోబర్ 11న కేంద్రానికి సిఫారసు చేశారు. దానిని రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపడంతో జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి సోమవారంనాడు ఆమోదం తెలిపారు.

సీజేఐ పదవిలో జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు అంటే 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు. జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13వ తేదీన సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు కంటే ముందు అక్టోబర్ 31, 2013 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అంతకముందు అంటే మార్చ్ 2000 నుంచి అక్టోబర్ 2013 వరకూ బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1998-2000 వరకూ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం, కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతించడం వంటి కీలక తీర్పులిచ్చారు. విశేషమేంటంటే జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం సేవలందించారు.