ఇకపై ‘జస్టిస్ ఫర్ దిశ’.. ప్రియాంక పేరు మార్చిన సజ్జనార్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై ‘జస్టిస్ ఫర్ దిశ’.. ప్రియాంక పేరు మార్చిన సజ్జనార్

December 1, 2019

శంషాబాద్‌ ప్రాంతంలో పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

CP Sajjanar.

బాధితురాలి పేరును ఇకపై ‘జస్టిస్ ఫర్ దిషా’ పేరుతో పిలవాలని సీపీ సజ్జనార్ సూచించారు. నిర్భయ, అభయ పేర్లలానే ప్రియాంక రెడ్డి పేరును దిషాగా మార్చారు. ప్రియాంక కుటుంబ సభ్యులను ఒప్పించిన సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో, ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి పేరు వాడొద్దు అని.. జస్టిస్ ఫర్ దిషాకు అందరూ సహకరించాలని సజ్జనార్ కోరారు.