కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంట్ స్యభులు, పార్టీల నేతల పేరుతో లేఖ రాశారు. తన ఆవేదనను వ్యక్తం చేయడంతో పాటు క్షమాభిక్ష కోరారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు సుప్రీం కోర్టుకు చెందిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం విధించిన ఆరు నెలల జైలు శిక్షను మినహాయించాలని జస్టిస్ కర్ణన్ విన్నవించారు. ఉన్నత న్యాయవ్యవస్థలోని అవినీతి గురించి ప్రస్తావించినందుకు ఈ శిక్ష విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టు జడ్జిగా తనను నియమించిన రాష్ట్రపతికి మాత్రమే ఆ పదవి నుంచి తొలగించే అధికారం ఉందని జస్టిస్ కర్ణన్ ఆ లేఖలో ప్రస్తావించారు.’రాష్ట్రపతి నన్ను న్యాయమూర్తి పదవిలో నియమించారు. దానిని తొలగించే అధికారం కూడా ఆయనకే ఉంది. పార్లమెంటులో అభిశంసన తీర్మానానికి 2/3 వంతు సభ్యుల మద్దతు ఉండాలి. సుప్రీం కోర్టుకు చెందిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకపక్షంగా తనను పదవి నుంచి తప్పించడ అన్యాయం”.అని అన్నారు. అలా కాకుండా సుప్రీం కోర్టుకు చెందిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకపక్షంగా తనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించడంతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధించడాన్ని జస్టిస్ కర్ణన్ తప్పుపట్టారు. ఇది ధర్మాసనం ధిక్కారం, రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు పార్లమెంట్ అధికారాలను దుర్వినియోగం చేయడమేనని జస్టిస్ కర్ణన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ లింకు కొడితే లేఖ వస్తోంది. అందులో లేఖను అటాచ్ చేయాలి.
HACK:
- Justice Karnan writes a letter of Clemency to President.