సుప్రీం కోర్టు చీఫ్‌గా జస్టిస్ బాబ్డే ప్రమాణం - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీం కోర్టు చీఫ్‌గా జస్టిస్ బాబ్డే ప్రమాణం

November 18, 2019

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. సర్వోన్నత న్యాయస్థానానికి ఆయన 47వ న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 13 నెలల పాటు ఆయన చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

మాజీ సీజే జస్టిస్ గొగోయ్ పదవి కాలం ముగియడంతో ఆయన స్థానంలో బాబ్డే పేరును రాష్ట్రపతి ఆమోదించారు. 2021 ఏప్రిల్ 23న చీఫ్ జస్టిస్ బాబ్డే పదవీ విరమణ చేయనున్నారు.1956 లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించిన బాబ్డే…న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. తర్వాత 1978లో అతడు న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. వివిధ కోర్టుల్లో జడ్జిగా ఆయన 21 ఏళ్ల పాటు పని చేశారు. 2000 మార్చ్ 29న బాంబే హైకోర్టు జడ్జిగా బాధ్యతలను చేపట్టారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులు అయ్యారు. తాజాగా వెల్లడించిన అయోధ్య కేసు తీర్పులో ఐదుగురు సభ్యుల న్యామూర్తుల్లో ఈయన కూడా ఒకరు.