సత్యం గెలిచింది...సత్యంబాబు ఓడిపోయాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

సత్యం గెలిచింది…సత్యంబాబు ఓడిపోయాడు..!

July 29, 2017

సత్యం గెలిచింది కానీ సత్యం బాబు ఓడిపోయాడు.8 ఏండ్ల పాటు జైళ్లో ఉండి ఏం కోల్పోయాడనే విషయంలో చర్చ ఇపుడు అనవసరం కానీ మనందరం కలిసి సత్యం బాబును గెలిపించాలి.జైళ్లో ఉన్న ఒత్తిడిని జయించి సత్యంబాబు డిగ్రీలో బి.ఎ పూర్తి చేసాడు.అయితే తాను నష్టపోయిన దానికి పరిహారం అడగడంలేదుత,బ్రతకడానికి చిన్న ఉద్యోగం కావాలని బ్రతిమిలాడుతున్నాడు.

పదిమంది నేరస్థులు తప్పించుకున్నా పర్వాలేదు,కానీ ఒక్క నిర్ధోషికి శిక్షపడకూడదు అని చెప్పే గొప్ప న్యాయవ్యవస్ధ మనది.కానీ నిజం గొంతు నొక్కి…న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి..అబద్దాన్ని నిజం చేసి ఒక నిర్ధోశిని దోశిని చేసి.. 8 ఏండ్లు కటకటాల వెనక్కి పంపిన వైనం.అసలు నిజాలను తెలుసుకోకుండా అమాయకున్ని బలి పశువును చేసిన అధికారులు? మ‌న దేశంలో బ‌డాబాబులు, రాజ‌కీయ నాయ‌కుల ప‌లుకుబ‌డి ఏ విధంగా ఉందో చెప్పేందుకు ఈ సంఘ‌ట‌నే ప్రత్య‌క్ష నిద‌ర్శ‌నం. డ‌బ్బులిస్తే చాలు, తిమ్మిని బ‌మ్మిని, బ‌మ్మిని తిమ్మిని చేస్తున్న రోజులివని రుజువైంది.ఓ సామాన్యుడు బ‌డాబాబులు ఇరికించిన కేసు నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు.8 ఏండ్లు నేరస్థుడిగా ముద్రవేసిన..చట్టం మరి ఇపుడు సత్యం బాబుకు ఏం న్యాయం చేస్తుంది? తను కోల్పోయిన జీవితాన్ని ఎలాగో తిరిగి తీసుకు రాలేదు దానికి పత్యామ్నాయంగా అతనికి ఏం చేస్తే బాగుంటుంది?

విజయవాడలో ఆశేషా మీరా హత్య కేసు..!

ఆయేషా మీరా విజయవాడలోని ఓ హాస్టల్ 2007 లో హత్యకు గురైన విషయం తెలిసిందే, ఈ క్ర‌మంలో సంఘ‌ట‌న జ‌రిగిన 9 నెల‌ల‌కు స‌త్యం బాబు అనే యువ‌కుడిపై పోలీసులు కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు,తను ఈనేరం చేయలేదంటూ  సత్యం బాబు ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు..అయితే స‌త్యం బాబును నేరం ఒప్పుకోవాల్సిందిగా పోలీసులు తీవ్రంగా కొట్టిన‌ట్టు కూడా అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఆయేషా మీరా హ‌త్య కేసులో సత్యంబాబును దోశిగా తేల్చి కటకటాల వెనక్కి పంపారు,8 ఏండ్లు నేరస్థుడిగా ముద్రపడి శిక్ష అనుభవించాడు సత్యంబాబు.అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత హై కోర్టు  ఈ కేసులో తీర్పు ఇచ్చింది. ఆయేషా మీరాను సత్యం బాబు చంప‌లేద‌ని  అతను నిర్దోషి అని పేర్కొంటూ హై కోర్టు తీర్పు వెల్ల‌డించింది.మరి ఆశేషాను చంపిందెవరు దోశులను  పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు? ఆ విషయం పక్కన పెడితే…

ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు జైలు కెళితే ఆతల్లి పడ్డ ఆవేదన…!

సత్యం బాబు జైలుకెళ్లగానే అతని కుటుంబ పరిస్థితులు దారుణంగా మారాయి,రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు,ఆసరాగా ఉండాల్సిన కొడుకు జైలులో..కొండంత దుఖాన్ని దిగమింగుకొని కూలీ చేస్కొని  సత్యం బాబు తల్లి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది.8 ఏండ్లుగా వాళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీకావు,మరి పర్సనల్ గాఇంత లైఫ్ ని కోల్పోయిన సత్యం బాబు బ్రతకడానికి జీవనాధారం  ప్రభుత్వమే చూపించాలి  అదే న్యాయం.సత్యం బాబుకి అన్ని విషయాల్లో ప్రభుత్వమే అండగా నిలబడాలి అదే ధర్మం.