కెనడియన్ పాప్‌స్టార్ జస్టిన్ బీబర్‌కు లాస్‌ఏంజెల్స్ పోలీసులు జరిమానా వేశారు. బీబర్ మెర్సిడెస్ జీ-వేగన్ కారులో వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ చిక్కాడు. వెంటనే బీబర్ కారు ఆపి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు 162 డాలర్ల జరిమానా విధించారు. బీబర్ కూడా పోలీసులతో ఎలాంటి వివాదం పెట్టుకోకుండా మర్యాదపూర్వకంగా జరిమానా కట్టాడు. బీబర్ ప్రస్తుతం వరల్డ్ టూర్‌లో ఉన్నాడు. టూర్‌లో భాగంగా మేలో బీబర్ భారత్ వచ్చాడు. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో బీబర్ కాన్సర్ట్ నిర్వహించాడు.