దొంగ మనవడు.. దండగమారి బామ్మకు సంకెళ్లు  - MicTv.in - Telugu News
mictv telugu

దొంగ మనవడు.. దండగమారి బామ్మకు సంకెళ్లు 

August 4, 2020

Juvenile apprehended for theft, tells police he acted on mother''s instructions.

పిల్లలకు మొదటి పాఠశాల అమ్మ ఒడి అంటారు. అక్కడినుంచే చిన్నారులు బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, మంచీ, చెడును కాస్త కాస్త తెలుసుకుంటుంటారు. ఆ తర్వాత బడికి వెళ్లి లోకజ్ఞానం గురించి తెలుసుకుంటారు. అనంతరం స్నేహితులతో సావాసం చేస్తారు. అక్కడే వారిలో మంచీ చెడ్డ అన్న బీజం పడుతుందని పెద్దలు అంటారు.  మంచి దోస్తానా చేస్తే మంచివారిగా ఉంటారు. చెడ్డ దోస్తానా పడితే చెడ్డవారిగా మారతారు. అయితే ఈ ఘటనలో అమ్మ, అమ్మమ్మలు కలిసి 12 ఏళ్ల మైనర్ బాలుడిని దొంగను చేశారు. స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన సదరు బాలుడిని అమ్మ, అమ్మమ్మలు కలిసి వారి స్వార్థం కోసం దొంగతనానికి ఉసిగొల్పారు. పిల్లలు పెద్దలు చెప్పింది వింటారు కాబట్టి, వాళ్లు చెప్పింది మంచా చెడా అని ఆలోచించరు వాళ్లు.

ఈ క్రమంలో ఆ బాలుడు అతను ఏకంగా రూ. 1.2 లక్షలు దొంగిలించాడు. ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి, బామ్మల ప్రోత్సాహంతో ఆ చిన్నారి పార్క్ చేసి ఉన్న వాహనంలోంచి రూ. 1.2 లక్షలను దోచేశాడు. బాధితుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఈ దొంగతనం బాలుడే చేశాడని గుర్తించారు. బాలుడి ఆచూకీ గుర్తించి పట్టుకున్నారు. ఆ మైనర్ నుంచి రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని పోలీసులు విచారిస్తుండగా.. అమ్మ, అమ్మమ్మలే తనను ఇలా దొంగతనాలకు ఉసిగొలిపారని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. దీంతో పోలీసులు సదరు వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని ఆమె నుంచి రూ. 1.05 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాలుడి తల్లి ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.