ధోనీ కూతుర్ని రేప్ చేస్తానన్న టీనేజర్ అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

ధోనీ కూతుర్ని రేప్ చేస్తానన్న టీనేజర్ అరెస్ట్ 

October 12, 2020

Juvenile from Kutch rounded up over ‘threats’ to cricketer’s daughter

సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకునే ఓ అతి కామెంట్లు చేసిన నెటిజన్ తిక్క కుదిర్చారు పోలీసులు. క్రికెటర్‌, భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో బాగా ఆడలేదని ఆయన కుమార్తె ఐదేళ్ళ జీవాపై ఓ అగంతకుడు అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని బొక్కలో తోశారు. గుజరాత్‌లోని కచ్‌ జిల్లా ముంద్రా ప్రాంతంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం సదరు కీచకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్యంపుణ్యం ఎరుగని బాలిక మీద కారుకూతలు కూశాడు. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైంది. ఈ ఓటమికి కెప్టెన్ ధోనీ బాధ్యత వహిస్తాడని సదరు కుర్రాడు ఆయన కుమార్తె మీద అసభ్యంగా కామెంట్లు చేశాడు. వాటిని ధోనీ భార్య సాక్షి ధోనీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. దేశంలో వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్న క్రమంలో అతడు చేసిన కామెంట్లు మరింత దూమారానికి తెరలేపామయి. మరోవైపు ధోనీ అభిమానులు అతని మీద విరుచుకుపడ్డారు. 

దీంతో అతడు తన పోస్టులను తొలగించాడు కానీ, వాటి తాలూకు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. వాటిని చూసి చాలా మంది అతన్ని తిట్టిపోశారు. ఇలాంటి అతి ఆలోచనలు ఉన్నవారి వల్లే దేశంలో ఆడపిల్లల మీద అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టిన పోలీసులు రెండు రోజుల్లోనే నిందితుడిని గుర్తించారు. అతని వయసు 16 ఏళ్లే అవడంతో పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. ఈ వయసులోనే అతడిలో ఇంతటి తీవ్ర ఆలోచనలు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఆ పోస్టు చేసింది తానే అని ఆ టీనేజర్ అంగీకరించినట్లు పోలీసు అధికారి తెలిపారు. బెదిరింపు మెసేజ్‌కు సంబంధించిన అంశాన్ని కచ్ పోలీసులతో రాంచీ పోలీసులు షేర్ చేసుకున్నారు. కాగా, త్వరలో రాంచీ పోలీసులకు నిందితుడిని అప్పగించనున్నారు.