దర్శకుడి నోటి దురుసు..అత్యాచారాలకు మహిళలే కారణమట.! - MicTv.in - Telugu News
mictv telugu

దర్శకుడి నోటి దురుసు..అత్యాచారాలకు మహిళలే కారణమట.!

November 27, 2019

ఆయన ఓ సెలబ్రెటీ.. అందులోనూ సినిమాలు తీసే దర్శకుడు. సభ్య సమాజానికి నాలుగు మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీసే స్థాయిలో ఉండి కూడా అల్పుడిలా మాట్లాడి అందరితో చివాట్లు తింటున్నాడు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు వారే కారణమని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. తమిళ దర్శకుడు, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కే. భాగ్యరాజా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు.‘కరుత్తుగలై పుది ఉసెయ్’ సినిమా ట్రైలర్ విడుదల సందర్బంగా భాగ్యరాజా మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

K.Bhagyaraj.

మహిళలు వివాహేతర సంబంధం కోసం పిల్లల్నీ,భర్తల్ని కూడా చంపే స్థాయికి వెళ్లిపోయారని అన్నారు. దీనంతటికి వారు సెల్ ఫోన్ వాడటం కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు. ఇలా కొంత మంది రెండు ఫోన్లు, రెండు సిమ్స్ వాడటం వల్లే వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయని కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట దుమారం రేపుతున్నాయి. దీనిపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు తన కుటుంబానికి కూడా వర్తిస్తాయని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదని వెంటనే క్షమాపన చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.