ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మి(86) మృతి చెందారు. భర్త మృతి చెందాక ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయింత్రం 6:15 నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు. నిద్రలోనే కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి జయలక్ష్మి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రేపు పంజాగుట్ట స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. జయలక్ష్మి 15 ఏళ్ల వయుస్సులోనే విశ్వనాథ్‌ను వివాహమాడారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ ఈనెల 2వ తేదిన ఆనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. కె. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం.