KA Paul 15 questions to the Election Commission and CM KCR on the Munugode by-election
mictv telugu

మునుగోడు ఉపఎన్నికపై కేఏ పాల్ 15 ప్రశ్నలు

November 9, 2022

మునుగోడును అమెరికా చేస్తాను అంటూ.. ఉపఎన్నికలో తనదైన శైలిలో ప్రచారం చేసిన.. కేఏ పాల్‌కు ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. అయితే ఈ పోరాటంతో తన ఓటమిని పాల్ ఒప్పుకోలేదు. ఉపఎన్నికపై 15 ప్రశ్నలను కేఏ పాల్ కేసీఆర్, ఎన్నికల సంఘంపై కురిపించారు. కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకోవడం అంటే ఇక్కడి భూములు ఆక్రమించడం, అమ్ముకోవడం, లక్షల కోట్లు అప్పు చేయడం దాని అర్థమని కేఏ పాల్ విమర్శించారు. చండూర్ మున్సిపాలిటీలోని అమరవీరుల స్థూపం వద్ద కేఏ పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 15 ప్రశ్నలను ఎలక్షన్ కమిషన్‌కు, కేసీఆర్‌కు సంధించారు.

1. బ్యాటెట్ పేపర్‌తో కాకుండా ఈవీఎంలతో ఎన్నికలు ఎందుకు జరిపించారు?
2. ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఈసీ ఎందుకు పట్టించుకోలేదు?
3. ఎన్నికల అధికారులు అంతా కలిసి ఈవీఎంలలో మార్పులు చేయలేదా?
4. పోలింగ్ ముగిసిన తర్వాతి రోజే ఎందుకు కౌంటింగ్ చేపట్టలేదు?
5. ఎన్నికల అధికారులు మొత్తం కేసీఆర్ తొత్తులుగా మారిపోయారా?
6. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా?
7. ఆ సీసీ కెమెరాల పుటేజ్‌ల లింక్‌లను మాకెందుకు ఇవ్వలేదు?
8. అంటే అక్కడ ఈవీఎంల మార్పిడి జరిగిందని అర్థమవ్వట్లేదా?
9. స్ట్రాంగ్ రూమ్‌కు వేసిన సీల్ ఎందుకు మారిపోయింది?
10. టీఆర్ఎస్ ఏజెంట్లు గులాబీ కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్లో ఎందుకు ఉన్నారు?
11. పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన వృద్ధులతో ఈవీఎంలో ఉన్న రెండో నంబర్‌కు పోలింగ్ సిబ్బంది ఎందుకు ఓటు వేయించారు?
12. ఓటుకు డబ్బులు పంచినట్లు ఎన్నికల అధికారులకు తెలియదా?
13. తెలిసి కూడా ఎందుకు ఈ ఎన్నిక నిర్వహించారు?
14. కేటీఆర్ నిజంగా మునుగోడును దత్తత తీసుకుంటాడా?
15. ఇక్కడ భూములను ఆక్రమించి, అమ్ముకోవడమేనా..? దత్తత అంటే..?
వెంటనే ఈ ఎన్నికను రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. త్వరలోనే అన్ని సాక్ష్యాధారాలతో దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.