వైకాపా ఎంపీ నన్ను చంపుతానంటున్నాడు..కేఏ పాల్ - MicTv.in - Telugu News
mictv telugu

వైకాపా ఎంపీ నన్ను చంపుతానంటున్నాడు..కేఏ పాల్

July 7, 2020

Ka paul

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పటికే సొంత పార్టీ నేతలపై పలు విమర్శలు చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సంచలన ఆరోపణలు చేశారు.

రఘురామ కృష్ణంరాజు హిందూ, క్రైస్తవుల మధ్య గొడవపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంపీ ఏపీలో మత మార్పిడి చట్టాన్ని తీసుకురావాలని గతంలో డిమాండ్ చేశారని, దానిని పాల్ ఖండించినట్లు చెప్పారు. దీంతో ఎంపీ తన అసిస్టెంట్‌కు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించారని కేఏ పాల్ తెలిపారు. రఘురామ కృష్ణంరాజు లాంటి వారిని ప్రపంచలో చాలా మందిని చూశానని, తానూ గత ఎన్నికల్లో గెలవాలని ప్రార్థన చేస్తే నన్నే చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తే మీరే పోతారని హెచ్చరించారు. తనను బెదిరించిన మెస్సేజ్ కూడా తమ దగ్గర ఉంది.. దాన్ని డీజీపీకి ఇస్తే అరెస్టు చేస్తారని కేఏ పాల్ హెచ్చరించారు.