KA Paul Campaign in Munugode
mictv telugu

బై పోల్ లో పొలిటికల్ థ్రిల్లర్ పాల్..!ప్రత్యర్థులూ నవ్వుని ఆపుకోలేరు..!

October 19, 2022

KA Paul Campaign in Munugode

సీరియస్ గా సినిమా నడుస్తోంది.థియేటర్ అంతా నిశ్శబ్ధం.ఒక్కసారిగా బ్రహ్మానందం తెరపై కనిపిస్తే నవ్వులే నవ్వులు.ఇప్పుడు పొలిటికల్ కారిడార్ లో పాల్ కనిపిస్తే నేతల్లో నవ్వులే నవ్వులే. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏం చేసినా,ఏం మాట్లాడినా నవ్వు వస్తుంది. ఎంత సీరియస్ మేటర్ మాట్లాడినా నవ్వురాకమానదు.సీరియస్‌గా సాగుతోన్న మునుగోడు బై పోల్ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేఏ పాల్ తనదైన స్టయిల్లో ముందుకుపోతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్ అభ్యర్థులు తారసపడితే వెళ్లిమాట్లాడుతున్నారు. సరదాగా ముచ్చట్లు పెడుతున్నారు. ప్రచారంలో అలసిపోతున్న నేతలు కేఏ పాల్‌ని రిలాక్స్ అవుతున్నారు. ఆయన మాటల్ని చూసి నవ్వు ఆపులేకపోతున్నారు.

బై పోల్ క్యాంపెన్‌లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేఏ పాల్ తారసపడ్డారు.బీజేపీ నాయకులతో మాట్లాడినా పాల్..ఆతర్వాతి రోజే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య తనకే ఓటేస్తానని చెప్పిందని పాల్ అన్నారు. ఇది విన్నా బీజేపీ కార్యకర్తలకే కాదు..జనానికి నవ్వు ఆగలేదు. ఓ చోట పోలీసులు కేఏ పాల్ ని ఆపారు..అంతే ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడ్డారు. “ఎవరనుకుంటున్నావ్..ఇక్కడ డాక్టర్ కేఏ పాల్.నన్నే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా…ఆప్ట్రాల్ నువ్వు ఎస్ ఐ వో,సీఐవో నన్నే ఆపుతావా,డీజేపీయే మంచి గౌరవం ఇస్తాడు.నువ్వు ఎంత” అంటూ సీరియస్ అయ్యారు కేఏ పాల్. ఈ సీన్లు చూసిన వారందరు నవ్వు ఆపుకోలేకపోయారు.

ఇప్పుడు ఉంగరానికి ఓటేస్తే… మునుగోడును అమెరికాలా మారుస్తానని కేఏ పాల్ అన్నారు.మునుగోడు బరిలో స్వతంత్ర అభ్యర్థిగా కే ఏ పాల్ పోటీ చేస్తున్నారు. ఉంగరం గుర్తు కేటాయించారన్న పాల్..ఓ హోటల్ లో దోశ వేస్తూ జనంతో మాట్లాడారు.

ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికాలా మారుస్తానని పాల్ చెప్పారు. ‘ఉంగరం గుర్తుకు ఓటేయండి… మునుగోడును అమెరికా చేసి పారేద్దాం’ అంటూ సెలవిచ్చారు.ఇలా మాట్లాడుతుండగానే జనం పాల్ కు కౌంటర్ ఇస్తూ ఉత్సాహంగా మాట్లాడారు. సీరియస్ గా సాగుతోన్న మునుగోడు ప్రచారంలో కేఏ పాల్ తనదైన స్టయిల్లో కామెడి పండిస్తున్నారు.