KA Paul demanded to give Bharat Ratna to Gaddar
mictv telugu

క్రైస్తవుల్లో ఐక్యత లోపించింది.. పార్టీ రద్దు కాలేదు : కేఏ పాల్

September 16, 2022

KA Paul demanded to give Bharat Ratna to Gaddar

కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల గుర్తింపు లేని పార్టీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖ మత బోధకుడు కేఏ పాల్ పార్టీ అయిన ప్రజా శాంతి పార్టీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న పాల్.. పలు విషయాలు వెల్లడించారు.

తమ పార్టీని ఈసీ రద్దు చేయలేదని, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. నోటీసులకు త్వరలోనే సమాధానం ఇస్తామని వివరించారు. క్రైస్తవులలో ఐక్యత లోపించిందని, ముస్లింలు ఐకమత్యంతో ఎంఐఎం వెనుక ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ యాదాద్రి కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు పెట్టారని, కానీ ఏ చర్చికైనా కనీసం 2 వేలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే అన్ని మతాలను గౌరవించి నిజమైన లౌకికవాదిగా నిలుస్తానన్నారు. వేల పాటలు రాసిన గద్దర్ నిజమైన శాంతిదూత అంటూ ప్రపంచ శాంతి కోసం ఆయనను అన్ని దేశాలకు తిప్పుతానని ప్రకటించారు. గద్దర్‌కు భారత రత్న అవార్డు ఇచ్చి సత్కరించాలని డిమాండ్ చేశారు. అటు బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని విమర్శించారు. సీఎం కేసీఆర్ లేఖ రాస్తే తాను లక్ష కోట్ల డబ్బును పెట్టుబడిగా తెస్తానని పాత పాట అందుకున్నారు. త్వరలో ఉప ఎన్నిక జరిగే మునుగోడు నియోజకవర్గంలో ప్రజల కోసం కొన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్టు వివరించారు.