ఆర్జీవీ సినిమాను ఆపండి..హైకోర్టుకు కేఏ పాల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్జీవీ సినిమాను ఆపండి..హైకోర్టుకు కేఏ పాల్

November 21, 2019

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, వైసీపీ పార్టీల రాజకీయాలు చంద్రబాబు, సీఎం జగన్, లోకేశ్‌, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ, అమిత్ షా పాత్రలతో ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో సినిమా తీసున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పట్ల ఏపీ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ చిత్రం సినిమా మరో వివాదంలో చిక్కుకుంది… ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలో తన పాత్రను అవమానపరిచే విధంగా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, రామ్‌గోపాల్ వర్మ, ఈ సినిమాలో తన పాత్రలో నటించిన జబర్దస్త్ కమెడియన్ రాము, తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. కాసేపట్లో పాల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లోని ప్రముఖ నేతలందరికి ఆర్జీవీ గురిపెట్టినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. నిన్న వర్మ రెండవ ట్రైలర్‌ను కూడా విడుదల చేశాడు. నవంబర్ 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల కాబోతుంది.