KA Paul filed a case against TRS in the High Court
mictv telugu

హైకోర్టులో టీఆర్ఎస్‌పై కేసు వేసిన కేఏ పాల్

April 27, 2022

KA Paul filed a case against TRS in the High Court

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ బుధవారం టీఆర్ఎస్ పార్టీపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కోసం నగరవ్యాప్తంగా ప్లెక్సీలు కట్టిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో ఈ ప్రభుత్వమే ప్లెక్సీలు వద్దని, ఒకవేళ ఎవరైనా పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులిచ్చిందన్నారు. ఇప్పుడు అదే ప్రభుత్వం నిబంధనలకు కాదని, ప్రజలు ఇబ్బంది పడేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

వెంటనే ప్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. కాగా, కేఏపాల్ కొద్ది రోజులుగా తెలంగాణలో తన దూకుడు పెంచారు. గవర్నర్‌ను కలవడం, కేసీఆర్ అరెస్టు అవడం ఖాయం వంటి వ్యాఖ్యలు, ఇప్పటివరకు ఇంత అవినీతిని చూడలేదని చెప్పటం వంటివి చూస్తే అది నిజమేననిపిస్తోంది. చూద్దాం ఏమవుతుందో.