KA Paul gave a warning to KTR over munugode by election
mictv telugu

కేటీఆర్‌పై కేఏ పాల్ ఫైర్.. టైం దగ్గర పడిందంటూ వార్నింగ్

November 8, 2022

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌‌‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘నీమోసం, డ్రామాలు, కుతంత్రం ఇంకెంత కాలం, నీకు సమయం దగ్గర పడింది. పైన దేవుడి తీర్పు కఠినంగా ఉంటుంద’ని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అనిల్ రెడ్డితో కొట్టించినా తాను పారిపోలేదని, కేటీఆర్‌‌‌లాగా భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. మునుగోడు ఎన్నికలో తన ఓటమికి అధికారులే కారణమని ఆరోపించారు.

పోలింగ్ రోజు ఈవీఎంలు రీప్లేస్ అయ్యాయనే విషయం ఆఫీసర్లకి తెలుసని, అందుకే తాను ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. బ్యాలెట్ పేపర్లు పెట్టాలని తాను ముందునుంచీ చెప్తున్నా అధికారులు వినలేదని, ఎన్నికలో జరిగిన అవకతవకలపై ఈ నెల 10న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రజాశాంతి పార్టీ గుర్తింపును ఈసీ రద్దు చేయడంతో స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలోకి దిగిన పాల్.. 805 ఓట్లు సాధించగలిగారు. ఫలితాలకు ముందు కనీసం 50 వేల మెజార్టీతో గెలుస్తానని ప్రగల్భాలు పలికారు. చివరికి వెయ్యి ఓట్లు కూడా రాకపోవడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక టీఆర్ఎస్ పది వేల ఓట్ల మెజారిటీతో మునుగోడులో గెలుపొందడం తెలిసిందే. సిట్టింగ్ స్థానమైన కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్లు రాకపోవడం గమనార్హం.