కేసీఆర్ అరెస్ట్ ఖాయం.. తమిళిసైతో భేటీ తర్వాత: కేఏ పాల్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ అరెస్ట్ ఖాయం.. తమిళిసైతో భేటీ తర్వాత: కేఏ పాల్

April 13, 2022

 

ooooooooooo

ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ ఈ రోజు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ అంశాలపై ఆమెతో చర్చించారు. గవర్నర్ పర్యటనల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించడానికే తాను అమెరికా నుంచి వచ్చానన్నారు. ‘కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. 8 లక్షల కోట్లు సొమ్ము దారి తప్పింది. ఆయనకు కళ్లు నెత్తికెక్కాయి. రేపో మాపో అరెస్ట్ అవడం ఖాయం. విభేదాల వల్లే ఆమెపై కేటీఆర్‌తో విమర్శలు చేయిస్తున్నాడు. అవినీతి అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నాడు. రైతు సంఘాల నాయకుడు రాకేశ్ టికాయత్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు’ అని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ప్రజాశాంతి పోటీ చేస్తుందని అన్నారు. ఏపీ సర్కారుపైనా ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డికి పాలన చేతగావడం లేదని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచాడని మండిపడ్డారు.